దిల్ రాజు బర్త్ డే స్పెషల్ – విజయ్ కు సూపర్ న్యూస్

దిల్ రాజు బర్త్ డే స్పెషల్ - విజయ్ కు సూపర్ న్యూస్

0
92

విజయ్ దేవర కొండ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. ఇప్పటికే వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే పూరితో ఫైటర్ సినిమాకు రెడీ అవుతున్నారు. ఇది బాలీవుడ్ లో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.. అక్కడ కరణ్ జోహార్ తో ఈ సినిమా నిర్మాణం పై ఒప్పందాలు చేసుకుంటున్నారు.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ గురించి మరో అప్ డేట్ వచ్చింది . .. నిన్ను కోరి మజిలీ ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన దర్శకుడు శివ నిర్వాణతో సినిమాని చేయనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు.

అయితే లవ్ ఓరియెంటెడ్ సెన్సిటీల్ కథలతో భలేగా యూత్ ని ఆకట్టుకున్నాడు దర్శకుడు శివ, తాజాగా మరి విజయ్ తో ఏ సినిమా చేస్తారు అనే అందరూ ఆలోస్తున్నారు.

దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన బయటకు వచ్చింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఉన్నాడు కాబట్టి అది అయిన తర్వాత ఫైటర్ సినిమా చేస్తాడు. ఆ తర్వాత శివ నిర్వాణ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అంటే ఈ సినిమా దాదాపు వచ్చే ఏడాది జూన్ తర్వాత స్టార్ట్ అవుతుంది అంటున్నారు… శివ నిర్వాణ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా టక్ జగదీష్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.