దిల్ రాజు ప‌వ‌న్ కు రెమ్యున‌రేష‌న్ ఇచ్చేది ఎంతో తెలుసా

దిల్ రాజు ప‌వ‌న్ కు రెమ్యున‌రేష‌న్ ఇచ్చేది ఎంతో తెలుసా

0
89

ప‌వర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ పక్కా అయిపోతోంది.. అయితే అది పింక్ అనేది మ‌రికొద్ది రోజుల్లో తేలిపోతుంది. తాజా వార్త‌ల ప్ర‌కారం మ్యూజిక్ కి థమన్ అప్పుడే రెండు ట్యూన్ లు కూడా ఇచ్చేసాడు. నివేదా థామస్, అంజలి, అనన్య క‌థానాయ‌క‌లుగా సెల‌క్ట్ అయ్యారు అని తెలుస్తోంది. వీరు ముగ్గురు అమ్మాయిలు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తార‌ట‌.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. సుమారు 50 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకోనున్నార‌ట‌… ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోగా సింగిల్ ఫేమెంట్ ఇవ్వాల్సి వుంది. అప్పుడే ఆయన షూటింగ్ కు వస్తారని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు స్ట్రాటజీ ఏమిటి అన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రశ్న. అయితే సినిమాకి 70 నుంచి 80 కోట్లు ఖ‌ర్చు చేస్తార‌ట అందులో ప‌వ‌న్ కు 50 కోట్లు ఇస్తార‌ట. మూడు నెల‌ల్లో సినిమా షూటింగ్ కంప్లీంట్ చేసి విడుద‌ల చేయాలి అని ప్లాన్ వేస్తున్నారు