పవన్ సినిమా పై దిల్ రాజు సంచలన నిర్ణయం

పవన్ సినిమా పై దిల్ రాజు సంచలన నిర్ణయం

0
111

సినిమా విడుదల తర్వాత లీకుల బెడద చాలా ఎక్కువ అయింది అనేది తెలిసిందే… అయితే ఈమధ్య పైరసీపై అందరూ కూడా వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు.. కాని ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా చిత్రీకరణ సమయంలో కూడా కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి, అయితే సినిమా కోసం ఎంతో ఆత్రుతగా చూసే అభిమానులకి ఫ్యాన్స్ కి ఈ ఫోటోలు షాక్ ఇస్తున్నాయి.

హీరో లుక్ అలాగే సినిమా లో కొన్ని సీన్స్ లీక్ అవుతున్నాయి.. అందుకే తాజాగా దీనిపై చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరీ ముఖ్యంగా ఎక్కడా సీన్స్ లీక్ అవకుండా చూస్తున్నారు, తాజాగా పవన్ కల్యాణ్ పింక్ సినిమా స్టార్ట్ అయింది .. అయితే ఈ సినిమాలో ఆయన లుక్ అనేది తొలిరోజు షూటింగ్ నుంచి బయటకు వచ్చింది.

దీనిపై డిజిటల్ మీడియాలలో యూట్యూబ్ లలో వైరల్ అవుతోంది.. అయితే నిర్మాత దిల్ రాజు దీనిపై సీరియస్ అయ్యారట …ఎక్కడా కూడా ఆ లుక్ కు సంబంధించి వీడియోలు లేకుండా ఆ చిత్ర టీం డిలీట్ చేయిస్తున్నారట. కాని ఫేస్ బుక్ లో మాత్రం విపరీతంగా ఫ్యాన్స్ దీనిని షేర్ చేసుకున్నారు.. దీంతో ఇక చిత్ర షూటింగ్ నుంచి ఎలాంటి లీక్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చూస్తున్నారు.