దిల్ రాజుతో పవన్ మరో సినిమా – టాలీవుడ్ టాక్

దిల్ రాజుతో పవన్ మరో సినిమా - టాలీవుడ్ టాక్

0
108

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదలై ఎంత పెద్ద విజయం అందించిందో తెలిసిందే.. ఇక నిర్మాత దిల్ రాజుకి కూడా మంచి లాభాలు వచ్చాయి, ఇక కరోనా సెకండ్ వేవ్ లో కూడా ఇటు అభిమానులు సినిమా ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాని చూసేందుకు వచ్చారు, ఇక సురేష్ బాబు అల్లు అరవింద్ దిల్ రాజు వీరు ముగ్గురు ఇలాంటి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు ఇక్కడ అదేచేశారు దిల్ రాజు.

 

 

పవన్ కల్యాణ్ తో సినిమా ప్రకటించిన సమయం నుంచి దిల్ రాజు ఎంతో జాగ్రత్తగా సినిమా షూటింగ్ చేశారు, నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. అయితే టాలీవుడ్ వార్తల ప్రకారం చూస్తుంటే పవన్ తో మరో సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట దిల్ రాజు.

 

మంచి కథతో మంచి డైరెక్టర్ తో సినిమా చేయాలి అని చూస్తున్నారట, ఇక పవన్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై పెట్టారు.

క్రిష్ .. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న ఆయన తర్వాత హరీశ్ శంకర్ – సురేందర్ రెడ్డి లతో చేయనున్నాడు, బహుశా ఈ రెండు పూర్తి అయిన తర్వాత ఆయనతో సినిమా ఉండవచ్చు అని టాక్ నడుస్తోంది.