తెలుగు చిత్రపరిశ్రమలో కెరియర్ ను స్టార్ట్ చేసి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఇలియానా. హీరో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సరసన నటించి తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ గోవా బ్యూటీ.
ఇక ఆ తర్వాత టాలీవుడ్ బోర్ కొట్టిందో ఏమో మూటా ముళ్లు సర్ధుకుని బాలీవుడ్ కు చెక్కుసింది. అయితే బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు మొదట్లో వరుస అవకాశాలు వచ్చాయి. బర్ఫీ వంటి సూపర్ హిట్ సినిమాలు ఇలియానా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత గోవా బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశల్లోనే కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఒకానోక సమయంలో కెరియర్ గురించి డైలమాలో కూడా పడిందని వార్తలు వచ్చాయి.
ఇక అదే టైమ్ లో ఈ ముద్దుగుమ్మకు ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాఫర్ ఆండ్రూస్ తో పరిచయమైంది. ఆపరిచయం కాస్త ప్రేమగా మారింది. గతంలో అండ్రుతో చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇలియానా గత ఏడాది బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసింది… ఒక వైపు సినిమాల్లో అవకాశాలు రాక మరో వైపు బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పడంతో ముద్దుగుమ్మ డిప్రెషన్ లోకి వెళ్లి అనుకోకుండా సూయిసైడ్ ఎటెంప్ట్ చేసిందట… మోతాదుకు మించి పవర్ ఫుల్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని చనిపోవాలనుకుందట ఇలియానా… అదే సమయంలో అధిక బరువు పెరిగిందట..
ఆ బరువుతోనే అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించినంది… తర్వాత నుంచి తన బరువు ను కంట్రోల్ చేసుకుని పాత షేప్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తుందట… అందుకే రోజుకొక ఫోటోలను సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తూ దర్శకులను పిచ్చెక్కిస్తోంది… సినిమాలో మళ్లీ నటించి గోవాలో సొంతిల్లు కొనుక్కోవాలని చూస్తుందట ఇలియానా