హీరోయిన్‌ కు ముద్దు పెట్టిన తెలుగు డైరెక్టర్.. వీడియో వైరల్

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా చోప్రా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఓ దర్శకుడు ఆమెకు పబ్లిక్‌గా ముద్దు పెట్టాడు. సినిమా హీరోయిన్లు బయటకు నవ్వుతూ కనిపించినా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సెట్‌లో కావొచ్చు.. పబ్లిక్ ప్లేస్‌లో కావొచ్చు అభిమానులం అని చెప్పి కొందరు వీళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఓ డైరెక్టర్ పబ్లిక్‌గా హీరోయిన్‌కి ముద్దుపెట్టేసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్.. డైరెక్టర్ తీరుపై విమర్శిస్తున్నారు.

- Advertisement -

‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఏఎస్ రవికుమార్ చౌదరి.. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ‘తిరగబడరా సామీ’ సినిమా తీశాడు. ఇందులో మన్నారా చోప్రా.. ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు సంబంధిచిన ప్రమోషన్స్ ఇటీవల నిర్వహించారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫొటోలకు పోజులిస్తుండగా మన్నారా చోప్రా అనుమతి లేకుండా ఆమెకు ముద్దుపెట్టేశాడు. ఆమె నవ్వేసి ఊరుకుంది గానీ వీడియో చూస్తుంటే మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీలైనట్లు అనిపిస్తోంది. గతంలో ఇలాగే హీరోయిన్ కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ముద్దుపెట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...