షారుక్ తో దర్శకుడు అట్లీ కుమార్ సినిమా – బిగ్ టాక్

Director Attlee Kumar film with Shahrukh khan

0
92

కోలీవుడ్ లో చాలా మంది దర్శకులు హీరో విజయ్ తో సినిమా చేయాలి అని కోరికతో ఉంటారు. ఆయనకు స్టోరీ చెప్పాలి అని చూస్తారు. అయితే విజయ్ కి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడిగా అట్లీ కుమార్ కి పేరు ఉంది. ప్రస్తుతం ఆయన షారుక్ తో సినిమా చేయనున్నారట ఈ వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

షారుక్ తో ఎలాగైనా ఒక సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నారు దర్శకుడు అట్లీ. అందుకే అట్లీ కుమార్ ముంబైలో మకాం పెట్టాడు. షారుక్ ని కలుసుకుని ఆయనకి ఒక కథ వినిపించాడు. షారుక్ కోరిన విధంగా మార్పులు చేర్పులు చేస్తూ వెళ్లాడు. అప్పుడు గానీ షారుక్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. తాజాగా ఈ సినిమా ఒకే అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారట. షారుక్ పై ఒక టీజర్ ను అట్లీ కుమార్ రెడీ చేయిస్తున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ వార్తల ప్రకారం టీజర్ ను ఆగస్టు నెలలో వదలనున్నట్టు చెబుతున్నారు. ఇక అభిమానులు దీని కోసం వెయిట్ చేస్తున్నారు.