Director Krish | రెండో పెళ్ళికి రెడీ అంటున్న స్టార్ డైరెక్టర్..!

-

ప్రేమ.. పెళ్ళి.. విడాకులు.. మళ్ళీ పెళ్ళి.. ఇది సినీ ఇండస్ట్రీలో షరా మామూలే. చాలా మంది స్టార్ల జంటలు ఇదే సూత్రాన్ని కూడా ఫాలో అయ్యాయి. నాగచైతన్య అక్కినేని, సమంత రుత్ ప్రభుల కథ కూడా ఇలానే సాగింది. వీరి విడాకుల తర్వాత నాగచైతన్య ఇప్పుడు మళ్ళీ పెళ్ళి స్టెప్ దగ్గర ఉన్నారు. ఇటీవల నటి శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసకుని అతి త్వరలో పెళ్ళి పీటలెక్కడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఇదే మార్గంలో నడవడానికి సిద్ధమవుతున్నాడు. అతడే క్రిష్(Director Krish). గమ్యం, వేదం వంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. 2016లో రమ్య అనే డాక్టర్‌ని వివాహమాడాడు. కొన్నాళ్లూ వివాహ జీవితం బాగానే సాగినా ఆ తర్వాత మనస్పర్థలు మొదలయ్యాయి. తీరా 2021లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. అప్పటి నుంచి క్రిష్ సింగిల్‌గానే ఉన్నాడు. తాజాగా ఈ దర్శకుడు రెండో పెళ్ళికి రెడీ అవుతున్నాడని టాక్.

- Advertisement -

ఈ క్రమంలోనే వచ్చేవారంలోనే నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేసుకున్నాడట. అయితే క్రిష్ రెండో పెళ్ళి చేసుకోబోతున్న మహిళే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమెకు ఇదివరకే పెళ్ళై 11 ఏళ్ల బాబు ఉన్నాడని టాక్. ఏదో ఫ్రెండ్ ఫంక్షన్‌లో వీరు కలిశారని, ఆ పరిచయం కాస్తా ఇప్పుడు పెళ్ళి వరకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఒక వారం రోజులైనా ఆగాల్సిందే. ఈ వార్తలపై ఇప్పటి వరకు క్రిష్(Director Krish) ఏమాత్రం స్పందించలేదు. దీంతో ఇది కీలకంగా మారింది.

Read Also: డార్క్ సర్కిల్స్‌ను వీటితో తగ్గించుకోవచ్చు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...