క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా ఎంతో సక్సెస్ ఫుల్ హిట్ అయింది, ఈ సినిమా తర్వాత
క్రిష్ కు ఎంతో ఫేమ్ వచ్చింది, అయితే ఈ సినిమా ద్వారా అందాలతార ప్రగ్యా జైస్వాల్ కూడా ఫేమస్ అయింది, పలు సినిమా అవకాశాలు వచ్చాయి ఆమెకి..
దర్శకుడు క్రిష్ తాజాగా ఉప్పెన ఫేం వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రొమాంటిక్ మూవీగా తెరకెక్కే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది, ఇక ఆమె రైతు కూలీగా కనిపించనుంది అని తెలుస్తోంది
అయితే ఈ సినిమాలో మరో పాత్ర కోసం మరో హీరోయిన్ ని ఎంపిక చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి, మరి ఆమె ఎవరు అంటే ప్రగ్యా జైస్వాల్ అని వార్తలు వస్తున్నాయి, క్రిష్ ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలి అని భావిస్తున్నారట. ఈచిత్రం ఇప్పుడు హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్ అడవుల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది, ఈ సినిమా షూటింగ్ తర్వాత పవన్ సినిమా స్టార్ట్ చేయనున్నారు.