2019 ఎండింగ్ లో టాలీవుడ్ లో ప్రతిరోజు పండగే చిత్రం అదరగొట్టింది అని చెప్పాలి, ఈ చిత్ర దర్శకుడు మారుతికి అభినందనలు వస్తున్నాయి.. ఇక సాయి ధరమ్ తేజ్ కు కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి.. ఇక మారుతి సినిమాతో నిర్మాతలకు కాసుల పంట పండింది అని చెప్పాలి.
అందుకే చిత్రం అనూహ్య విజయాన్ని సాధించిన నేపథ్యంలో సహ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ దర్శకుడు మారుతిని ప్రశంసిస్తూ.. ఆయనకు రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు.. ఈ సినిమా విడుదలైన 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.32.29 కోట్ల వసూళ్లను చేసింది. ఇది రికార్డుగా నమోదయింది.
హీరో సాయిధరమ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు నమోదు చేసింది.. ఇక మారుతి కారు అందుకున్న ఆనందంలో వంశీకి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ధన్యవాదాలు వంశీ డార్లింగ్, నీలాంటి స్నేహితుడు ఉంటే ప్రతి రోజూ పండగే అని తన సందేశంలో కోట్ చేశారు. ఆయన కారు కీ తీసుకుంటున్న సమయంలో తీసిన పిక్ షేర్ చేశారు, నిజంగా చిత్ర యూనిట్ కు ఈ సక్సెస్ పండగే అని చెప్పాలి