అల్లు అర్జున్ తో దర్శకుడు పరశురామ్ ? టాలీవుడ్ టాక్

Director Parashuram new movie with Allu Arjun

0
91

ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈసినిమాకి సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మహేశ్ బాబు కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు ఈ చిత్రం. ఇక ఇందులో మహేష్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి అభిమానుల్లో. ప్రిన్స్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

తర్వాత నాగచైతన్యతో పరశురామ్ సినిమా ఉండనుందట. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను ఆల్రెడీ పరశురామ్ రెడీ చేసిపెట్టుకున్నారట. ఇక ప్రిన్స్ చిత్రం అయ్యాక ఆ సినిమా పట్టాలెక్కనుంది. ఇక తాజాగా మరో వార్త వినిపిస్తోంది టాలీవుడ్ లో.
ఆయన ఇంకో చిత్రం కూడా లైన్ లో పెట్టారట.

గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర నుంచి గీతా ఆర్ట్స్ వారితో పరశురామ్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే తాజాగా బన్నీతో కూడా ఓ సినిమా చేయాలి అని చూస్తున్నారట. ఇంకా స్టోరీ వర్క్ లో ఉందట త్వరలో బన్నీకి ఆయన కథ వినిపించే అవకాశాలు ఉన్నాయి అని టాక్ నడుస్తోంది.