Prasanth Varma – Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఎప్పటి నుంచో చర్చల్లో ఉంటోంది. తన తనయుడిని పరిచయం చేయడానికి బాలకృష్ణ ఆపసోపాలు పడుతున్నారు. ఎందరో దర్శకులతో చర్చలు చేస్తున్నారు. పలువురు దర్శకులు కూడా మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తమ దర్శకత్వంలోనే నందమూరి వారసుడు.. వెండితెరకు పరిచయం కావాలని చాలా మంది భావిస్తున్నారని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒకానొక సమయంలో తన కుమారుడి తొలి సినిమాను డైరెక్ట్ చేయడానికి డైరెక్ట్‌గా బాలకృష్ణనే(Balakrishna) రంగంలోకి దిగుతున్నారన్న వార్త కూడా వినిపించింది.
కాగా, తాజాగా కొన్ని రోజుల నుంచి మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) రెడీ అయ్యాడని సమాచారం సినీ సర్కిల్స్‌లో చర్చ మొదలైంది. కాగా ఈ వార్తలు కాస్తా.. తాజాగా ఊహించని మలుపు తీసుకున్నాయి. మోక్షజ్ఞ లాంచింగ్ ప్రాజెక్ట్ నుంచి ‘హనుమాన్’ డైరెక్ట్ ప్రశాంత్ తప్పుకున్నాడట. క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతోనే ప్రశాంత్ వర్మ తప్పుకున్నారని సినీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం. దీంతో మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి ఎంకెవరు ముందుకొస్తారో చూడాలి.