పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్ చేసిన సినిమా ‘సలార్: సీజ్ ఫైర్’. ఈ సినిమా ఎంతటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలైన ప్రతి థియేటర్‌లో కూడా బాక్స్‌లు బద్దలయ్యాయి. బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేసేసింది. ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఇప్పటికి కూడా చాలా మంది ప్రభాస్ అభిమానులు కాని వారు కూడా సలార్‌ను చూడటానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.
ఇంతటి హిట్ అందుకున్న ‘సలార్(Salaar)’ సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ తనను చాలా నిరాశపరిచిందన్నాడు. అసలు తాను ఊహించిన స్థాయిలో ‘సలార్’ రాణించలేకపోయిందని బాధపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ ‘సలార్’ సక్సెస్‌పై స్పిందించాడు.
‘‘సలార్ సినిమా ఇచ్చిన రిజల్ట్స్‌తో నేను సంతోషంగా లేను. ఫస్ట్ పార్ట్ కోసం నేను పడిన కష్టంతో పోలిస్తే.. నిరాశగానే అనిపించింది. సినిమాలో ఎక్కడో ‘కేజీఎఫ్2’ ఛాయలు కనిపించాయి. ఒక ఎప్పుడూ అలా జరగదు. ‘సలార్ 2’ మాత్రం నా కెరీర్ బెస్ట్ మూవీగా తీస్తా.
ప్రేక్షకులు అంచనాలకు కూడా అందకుండా ఈ సినిమాను రెడీ చేస్తా. జీవితంలో కొన్ని విషయాలపై చాలా స్పష్టతతో ఉన్నా. మళ్లీ చెప్తున్నా.. ఎవరూ క్వశ్చన్ చేయడానికి, వేలు చూపడానికి వీలు లేకుండా ‘సలార్-2’ను రెడీ చేస్తా. నేను చేసిన ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమాను తీర్చిదిద్దుతా’’ అని ప్రశాంత్(Prashanth Neel) చెప్పాడు. ఆయన వ్యాఖ్యలతో ‘సలార్-2’పై అంచనాలు మరింత అధికమయ్యాయి.