రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తారు అని అందరూ ఎదురుచూస్తున్నారు, అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం చెర్రీ తదుపరి చిత్రం పై బిగ్ ప్లాన్ వేశారు అంటున్నారు..
సౌత్ ఇండియాలో దిగ్గజ దర్శకుడిగా శంకర్ కు పేరుంది. ఆయన చిత్రాలు అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే మంచి స్టోరీతో ప్రజల్లోకి వస్తారు శంకర్.
తాజాగా ఆయన చెర్రీతో సినిమా చేస్తారు అని వార్తలు గత రెండు నెలలుగా వినిపిస్తున్నాయి. అయితే శంకర్ దర్శకుడిగా హీరోగా చరణ్, అలాగే నిర్మాతగా దిల్ రాజు ఉంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో… ఇది పాన్ ఇండియా సినిమాగా వస్తుంది అంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ అలాగే ఆచార్య పూర్తి అవ్వగానే శంకర్ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.
మొత్తానికి దీనిపై మంతనాలు జరుగుతున్నాయి స్టోరీ లైన్ ఇప్పటికే వినిపించారని దీనిపై వర్క్ జరుగుతోంది అని వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి, ఇది నిజం కావాలి అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.