దర్శకుడు శంకర్ కు దిల్ రాజు భారీ రెమ్యునరేషన్

దర్శకుడు శంకర్ కు దిల్ రాజు భారీ రెమ్యునరేషన్

0
96

సౌత్ ఇండియాలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు శంకర్.. ఆయన తీసే సినిమాలు చాలా వరకూ ఆలోచింపచేసేవిగా ఉంటాయి, సమాజంలో అనేక విషయాలు తీసుకుని తన సినిమాలో స్టోరీగా చూపిస్తారు, ఆయన సినిమాలు సొసైటీలో ఎంతో పేరు గడించాయి.. ఇక ఆయనతో చేసిన హీరోలు స్టార్లుగా కూడా మారారు… ట్రెండ్ కు తగ్గట్లు కథను కూడా రాస్తారు, అలాగే అద్బుతంగా తీస్తారు సినిమాని.

 

ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇండియన్ 2 చేస్తున్నారు… ఈ సినిమా తర్వాత ఆయన చరణ్ తో సినిమా చేయనున్నారు, దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రానుంది ఇది పాన్ ఇండియా చిత్రంగా రానుంది… దిల్ రాజు నిర్మిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ..అయితే ఇప్పటి వరకూ దర్శకులకి ఇచ్చిన పారితోషికం కంటే దర్శకుడు శంకర్ కు ఇచ్చే పారితోషికం ఎక్కువ ఉంటుంది అనేది తెలిసిందే.

 

ఎందుకు అంటే ఈ పాన్ ఇండియా సినిమా అలాగే భారీ కాస్టింగ్ అలాగే భారీ బడ్జెట్ చిత్రం , అందుకే దర్శకుడు శంకర్ కు కూడా భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్ నడుస్తోంది… శంకర్ నేరుగా తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం.