దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి – వరుడు ఎవరంటే

Director Shankar marries Aishwarya's daughter

0
88

సౌత్ ఇండియాలో అగ్రదర్శకుడిగా కొనసాగుతున్నారు శంకర్ . ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు, ఇక తాజాగా ఆయన ఇంటిలో పెళ్లి సందడి మొదలైంది. శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లిపీటలు ఎక్కబోతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో ఆమె వివాహం జరగబోతోంది. ఇక శంకర్ కుమార్తె ఐశ్వర్య ప్రముఖ డాక్టర్, ఆమెని క్రికెటర్ రోహిత్ కి ఇచ్చి వివాహం చేయనున్నారు.

రోహిత్ దామోదరన్ తండ్రి దామోదరన్ పారిశ్రామికవేత్త. అంతేకాదు మధురై పాంథర్స్ టీమ్ జట్టుకు స్పాన్సర్ కూడా. అయితే పెద్ద ఎత్తున ఎవరికిఈ వివాహానికి పిలవడం లేదు కేవలం శంకర్ కుటుంబ సభ్యులు రోహిత్ కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హజరు కానున్నారు.

మహాబలిపురంలో ఈ వివాహం జరగనుంది. ఇక కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ తో ఓ సినిమా అనౌన్స్ చేశారు శంకర్. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో అపరిచితుడు చిత్రం కూడా రీమేక్ చేయనున్నారు.