దూకుడు సినిమాకి సీక్వెల్ -ఈ వార్తలపై శ్రీను వైట్ల క్లారిటీ 

Director srinu vaitla clarification on Dookudu movie sequal

0
155

దర్శకుడు శ్రీను వైట్ల మంచి కామెడి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరియర్ లో అసలు గ్యాప్ ఇవ్వకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక ఎమోషన్స్ ఫ్యామిలీ కామెడీ అన్నీ కూడా ఆయన సినిమాల్లో ఉండేవి. అయితే ఎన్నో సూపర్ హిట్లు వచ్చినా, ఆయనకు తర్వాత కొన్ని వరుస ఫ్లాప్లు పలకరించాయి. దీంతో కాస్త సినిమాలు తగ్గాయి.

తాజా ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ ,నేను దూకుడు సినిమాకి సీక్వెల్ చేయనున్నట్టుగా, అలాగే ఓ మల్టీస్టారర్ చేయనున్నట్టుగా, కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇవి ఎవరూ నమ్మవద్దు. ఇందులో వాస్తవం లేదు. ఇది పుకారు మాత్రమే అని తెలియచేశారు. డి&డి సినిమా, ఢీ సినిమాకి సీక్వెల్ కాదు. ఈ రెండు కథ కధనాలు వేరు అని చెప్పారు. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి మూడు చిత్రాలు ఆయన ట్రాక్ లో పెట్టినట్టు తెలుస్తోంది.