అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ – ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల‌

director srinu vaitla done big mistake in movies

0
120

కొంత‌మంది ద‌ర్శ‌కులు సినిమా ప‌రిశ్ర‌మ‌లో త‌మ మార్క్ చూపిస్తారు. అందులో ఒక‌రు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల. ఆయ‌న సినిమాలు మంచి కామెడీతో ఉంటాయి. అభిమానులు ఆయ‌న చిత్రాల‌ను ఎంతో ఇష్ట‌ప‌డేవారు.

యాక్షన్ , కామెడీ. ఎమోష‌న్ ఇలా అన్నీ ఆయ‌న క‌థ‌లో మిళితం అవుతాయి. అందుకే ఆయ‌న సినిమాల‌కు ఎంతో క్రేజ్ ఉంది. అయితే కొంత‌కాలం స‌క్స‌స్ లు వ‌చ్చాయి, త‌ర్వాత ఆయ‌న సినిమాలు వ‌రుస ప‌రాజ‌యాలు అవ్వ‌డంతో కాస్త వెన‌క‌బ‌డ్డారు అనే చెప్పాలి.

అయితే తాజాగా ఇంట‌ర్వ్యూలో దీనిపై మాట్లాడారు శ్రీనువైట్ల‌.మొదటి నుంచి కూడా నేను వినోదప్రధానమైన సినిమాలనే చేస్తూ వెళ్లాను. కొత్తగా చేయాలనే ఉద్దేశంతో రూట్ మార్చాను. కానీ శ్రీను వైట్ల సినిమాలు ఇలాగే ఉండాలని కోరుకున్న ప్రేక్షకులకు. ఇలా కొత్త సినిమాలు చేయ‌డం న‌చ్చ‌లేదు. అందుకే ప‌రాజ‌యం అయ్యాయి సినిమాలు అని తెలిపారు శ్రీనువైట్ల‌. మంచు విష్ణు హీరోగా ఆయన డి అండ్ డి చిత్రం చేస్తున్నారు. ఆయ‌న మ‌ళ్లీ గ‌తంలో ఎలా మంచి ఫేమ్ పొందారో అలా పొందాల‌ని స‌క్స‌స్ లు రావాల‌ని మ‌నం కూడా కోరుకుందాం.