దర్శకుడు తేజ పేరు టాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఓ విషయంలో వినిపిస్తూనే ఉంటుంది… ఆయన హీరో హీరోయిన్లని కొడతాడు అని టాక్ కూడా ఉంది.. అందుకే పెద్ద పెద్ద సినిమాలు ఆయన చేయరు అని అంటారు, కథలో మార్పులు చేర్పులు చేయరు అనేది తెలిసిందే, తాజాగా ఆయనపై హీరోయిన్ రాశి తీవ్ర ఆరోపణలు చేశారు, గతంలో తేజ తనని మోసం చేశాడు అని ఆమె తెలియచేసింది.. నిజం సినిమాలో తనని మోసం చేశారు అని ఆమె తెలియచేసింది.
అప్పుడే ఒక్కడు రిలీజైంది. పెద్ద హిట్. మహేష్ బాబు సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చాడు తేజ. గోపీచంద్ కాంబినేషన్ లో నాకు లవ్ అని చెప్పారు. మా ఇద్దరి మధ్య మంచి లవ్ సీన్స్ ఉంటాయని చెప్పారు. గోపీచంద్ కు, నాకు మధ్యలోకి విలన్ వస్తాడని చెప్పారు. నెగెటివ్ షేడ్స్ ఉంటాయని మచ్చుకు కూడా చెప్పలేదు. దీంతో ఆ క్యారెక్టర్ కి ఒప్పుకున్నారు మొదటి రోజు షూటింగ్ లో నాకు సీన్ అర్ధం అయింది అని చెప్పింది.
ఇక రెండో రోజు ఈ సినిమా మానేద్దాం అని అనుకున్నా , కాని అడ్వాన్స్ తీసుకోవడంతో సినిమా చేయవలసి వచ్చింది అని చెప్పింది రాశి. తనకు రంస్ధలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ కూడా వచ్చిందని , కాని మోకాలు వరకూ చీరకట్టుకోవాలి అని తనకు చెప్పారని, అంందుకే తాను చేయలేదు అని చెప్పింది రాశి.
.