Director Teja: ఉదయ్ ఆత్మహత్యకు కారణాలు తెలుసు.. నేను చనిపోయే లోపు చెప్తా..!

-

Director Teja sensational comments hero uday kiran suicide: లవర్‌ బాయ్‌గా పేరొంది, చాలా చిన్న వయస్సులోనే ఆత్మహత్యకు పాల్పడిన దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ గురించి డైరెక్టర్‌ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన అహింస సినిమా ప్రమోషన్లలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. ఉదయ్‌ కిరణ్‌ గురించి చెప్పుకొచ్చారు. నువ్వు-నేను సినిమా సమయంలో ఎంస్‌ రాజు తనకు ఫోన్‌ చేసి.. ఓ కథ ఉందనీ.. ఉదయ్‌ ఫోటోలు పంపించమని అడిగినట్లు తేజ తెలిపారు. ఓకే అయితే, తన సినిమాలోకి తీసుకుంటానని ఎంఎస్‌ రాజు చెప్పినట్లు వివరించారు. ఆ వెంటనే, “గాజువాక పిల్లా” వీడియోను తాను ఎంస్‌ రాజుకు పంపించినట్లు తేజ (Director Teja) తెలిపారు.

- Advertisement -

అది చూసిన వెంటనే.. ఉదయ్‌కు ఆయన మనసంతా నువ్వే సినిమాలో ఆఫర్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా ఉదయ్‌కు బ్యాక్‌ టు బ్యాక్‌ నువ్వు-నేను, చిత్రం, మనసంతా నువ్వే మూడు హిట్లు వచ్చాయని వివరించారు. దీని వల్ల అతడే కాస్త బ్యాలెన్స్‌ మిస్‌ అయ్యాడని వ్యాఖ్యానించారు. కానీ తను అది పొగరు అని అనుకోలేదనీ.. స్టార్‌డమ్‌ వచ్చినప్పుడు, మనిషి బ్యాలెన్స్‌ తప్పటం సర్వసాధారణం అని అనుకున్నట్లు తేజ తెలిపారు. ఆ తరువాత ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కున్నాడనీ.. ఆ తరువాత పిలిచి ఔనన్నా-కాదన్నా సినిమాలో అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. “మీ విషయంలో నేను ఎంతో పొగరుగా వ్యవహరించినా.. నన్ను గుర్తుపెట్టుకొని మరీ నాకు అవకాశం ఇచ్చారు.

మీ పాదాలు తాకుతా.. క్షమించానని ఒక్కసారి చెప్పండి చాలు” అని ఉదయ్‌ ప్రాధేయపడ్డాడని తేజ అన్నారు. ఉదయ్‌ కిరణ్‌ జీవితంలో జరిగిన ప్రతి విషయం తనకు తెలుసుననీ.. తను ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలు కూడా తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు తేజ. కానీ ఇప్పుడు చెప్పటం భావ్యం కాదనీ.. తను చనిపోయే లోపు ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వెనుక ఉన్న రహస్యాలు తప్పకుండా చెప్తానని తేజ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...