ప్రముఖ జబర్తస్త్ కమెడియన్ వేణు(Venu Yeldandi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా తనదైన శైలిలో రాణిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇటీవల బలగం(Balagam) అనే సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా బలగం సినిమా విజయవంతం అయింది. బాక్సాఫీస్ వద్ద కూడా సంచలన విజయం సాధించింది. దీంతో వేణు యెల్దండికి దర్శకుడిగా బాగా పేరు వచ్చింది. ఇప్పుడు అందరి చూపు ఆయన తీయబోయే రెండో చిత్రం గురించే. ‘‘రెండో చిత్రం స్టార్ట్ చేస్తున్నా’’ అనే హింట్‌తో ఒక పోస్ట్ చేశారు వేణు(Venu Yeldandi). ‘‘శ్రీ ఆంజనేయం’’ అని రాసి ఉన్న తన స్క్రిప్ట్ కాగితాల ఫోటోని ట్విట్టర్‌లో పెట్టారాయన. అంటే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టినట్లు లెక్క. స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాలో ఎవరు నటిస్తారు అనేది తేలనుంది. రెండో సినిమాని కొంచెం భారీ ఎత్తున తీయనున్నారు. దిల్ రాజు(Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది.
Read Also:
1. హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలేంటి? న్యాచురల్ గా ఎలా పెంచుకోవచ్చు?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat