రానా విరాటపర్వం విడుదల గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Director who gave clarity about the Rana Virataparvam movie release

0
108

ప్రస్తుతం కరోనా పరిస్దితుల వల్ల సినిమా థియేటర్లు ఓపెన్ కాలేదు. అయితే కొన్ని చోట్ల ఓపెన్ అయినా ప్రజలు వస్తారా రారా అనే అనుమానం నిర్మాతల్లో ఉంటోంది. అందుకే చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నవి ఓటీటీ బాట పడుతున్నాయి. నారప్ప కూడా అమెజాన్ లో రిలీజ్ అయింది. మరో రెండు సినిమాల గురించి ఇదే వార్తలు వినిపిస్తున్నాయి. రానా కథానాయకుడిగా విరాటపర్వం సినిమా రూపొందింది. ఇందులో రానా సరసన సాయిపల్లవి నటించింది.

సురేశ్ బాబు – సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, వేణు ఊడుగుల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 1990లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తీశారు. అయితే కరోనా పరిస్దితుల వల్ల ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారని వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ విషయంపై దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు. ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తామని తెలిపారు, మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా వర్క్ పూర్తవుతుందని అన్నారు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే పట్టుదలతోనే నిర్మాతలు ఉన్నారనీ, థియేటర్లు ఓపెన్ అయిన తరువాత పరిస్దితుల బట్టీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ సినిమా కోసం రానా అభిమానులు ఎదురుచూస్తున్నారు.