దర్శకుడిగా మారిన తెలుగు స్టార్ హీరో…

దర్శకుడిగా మారిన తెలుగు స్టార్ హీరో...

0
93

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో నిఖిల్ వరుస సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు… ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ2 సినిమా చేస్తున్నాడు… లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు… కరోనా తగ్గిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టనున్నారు…

కాగా ఎవరి అండ లేకుండా ఇండస్ట్రీలో స్వతహాగా ఎదిగాడు నిఖిల్… తాజాగా ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నిఖిల్ పాల్గొన్నాడు… ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలు బయటపెట్టాడు… తాను మొదట్లో దర్శకుడు అవ్వాలనే పరిశ్రమకు వచ్చి దర్శకత్వం శాఖలో పని చేశానని చెప్పాడు.

అనుకోని విధంగా హ్యపిడేస్ సినిమాలో హీరో అయ్యాడు… తాను దర్శకత్వం వహించే చిత్రం బాలా చిత్రమని తెలిపారు.. ఒక విధంగా చెప్పలంటే ప్రయోగాత్మక చిత్రమని చెప్పాడు…