సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో విలన్ పాత్ర అదే ప్రతినాయకుడి పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ గా ఉండాలి, ముఖ్యంగా బోయపాటి సినిమాల్లో ఇది మనకు బాగా కనిపిస్తుంది, ఇక జగపతిబాబు విలన్ గా ఎంత బాగా చేస్తున్నారో మనం చూస్తున్నాం, ఇలా గతంలో రావుగోపాలరావు ఈ పాత్రలు ఎంతో అద్బుతంగా చేసేవారు, ఇక ఆయన కుమారుడు రావు రమేష్ కూడా టాలీవుడ్ లో ఇలాంటి విలన్ పాత్రలు ఎంతో బాగా చేశారు.
ఇక ప్రతినాయకుడి పాత్ర అంటే ప్రకాష్ రాజ్ అనే చెప్పాలి దశాబ్దాల పాటు ఆయన ఎన్నో సినిమాల్లో ఈ పాత్రలు చేశారు, అయితే ఇప్పుడు నిర్మాతలు దర్శకులు ఈ పాత్ర కోసం ఒకరిని చూస్తున్నారు, ఆయన చేసిన సినిమాలు ఆ పాత్రలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.
ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రావురమేష్ వీరిని విలన్స్ గా చూశాం. ఇక తాజాగా కొత్త విలన్ తెలుగు ప్రేక్షకులను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. 2020లో సంక్రాంతికి అలవైకుంఠపురం చిత్రంతో మంచి హిట్టును ఖాతాలో వేసుకున్నాడు సముద్రఖని… ఈ ఏడాది క్రాక్ సినిమాలో కూడా మంచి రోల్ చేశారు, విలన్ గా అద్బుతంగా నటించారు, ఇప్పుడు అందరూ ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.. పెద్ద దర్శకులు చాలా మంది తమ సినిమాల్లో ఆయనకి కీలక రోల్స్ ఇస్తున్నారట. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ అంటే ఇప్పుడు అందరూ సముద్రఖని అని చెబుతున్నారు.