మహేష్ ఫ్యాన్స్‌కు నిరాశ..ఆ సినిమా ఇప్పట్లో లేనట్టే..?

0
94

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తరువాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” మే 12న థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహించగా..ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల వంటి స్టార్స్ తో పని చేయాల్సి ఉంది. అయితే ఇందులో ఏది ముందు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే రాజమౌళి మహేష్ బాబు మూవీ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది. జక్కన్న ఈ సినిమా స్క్రిప్టు పనులకు మరింత సమయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమాను పట్టాలెక్కించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

ఏదేమైనా రాజమౌళితో మహేష్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశను కలిగించే విషయమని చెప్పాలి. ఇక ఈ సినిమా అడవి నేపథ్యంలో సాగే కథతో రాబోతున్నట్లు ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.