సినీ పరిశ్రమలో విడాకులు కామన్ అయిపోయాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు డైవర్స్ తీసుకున్నారు. ఇక తాజాగా ఇదే బాటలో మరో బాలీవుడ్ జంట నడిచారు. బాలీవుడ్ నటుడు, సింగర్ యో యో హనీ సింగ్ తన భార్య షాలిని తల్వార్తో విడాకులు తీసుకున్నారు. భరణంగా కోటి రూపాయల చెక్కును సీల్డ్ కవర్లో పెట్టి ఫ్యామిలీ కోర్టుకు సమర్పించారు. అనంతరం విచారణను 2023 మార్చి 22కు కోర్టు వాయిదా వేసింది. కాగా హనీసింగ్-షాలిని.. 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.