తనపై వస్తున్న ఆ వార్తలు నమ్మకండి – నటి శారద ఆగ్రహం

Do not believe the news coming on her - actress Sharada is angry

0
98

ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్దం కాని పరిస్దితి . ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా సోషల్ మీడియాలో వారు చనిపోయారని పోస్టులు పెడుతున్నారు. చివరకు వారు తాము బతికి ఉన్నాము అని చెప్పకునే స్దితికి తీసుకువస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. ముఖ్యంగా ఇలాంటి వార్తలు ఎవరైనా ఏదైనా అనారోగ్యంగా ఉన్నారు అని తెలిస్తే వారి గురించి ప్రచారం చేస్తున్నారు. గతంలో ఇలాంటి వారిపై కేసులు పెట్టిన నటులు ఉన్నారు.

తాజాగా జాతీయ ఉత్తమ నటి శారద మరణించారని వస్తున్న వార్తలపై శారద స్వయంగా స్పందించారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఇలాంటి అసత్య వార్తలు నమ్మవద్దు అన్నారు. తాను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను చెన్నై లో ఇంటిలోనే ఉన్నానని తెలిపారు. తన పై వస్తున్న తప్పుడు వార్తలు నమ్మవద్దని ఇలాంటి పుకార్లు పనీపాటా లేని వారు పుట్టిస్తారని శారద ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా ఆమెకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఎందరో ఇప్పటి స్టార్ హీరోలకి తల్లిగా కూడా నటించారు. మూడు సార్లు జాతీయ ఉత్తమనటి అవార్డు అందుకున్నారు శారద. బాలనటిగా ఆమె సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇటు సీనియర్ ఎన్టీఆర్ తో ఆమె పలు సినిమాల్లో నటించారు. ఇటు బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున అలాగే ఈ తరం హీరోలతో కూడా ఆమె నటించారు.