ఈసారైనా అల్లుఅరవింద్ ఆహా అనిపిస్తారా…

0
92

ప్రస్తుతం సాగుతున్నఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల హవా గమనించి అల్లుఅరవింద్ ఆహా అనే ఓ ఓటీటీ ని ప్రారంభించాడు .అయితే దీనిపై తెలుగు ఆడియన్స్ అందరినుండి స్పందన బాగా వచ్చింది .మెంబర్ షిప్స్ కూడా బాగా పెరిగాయి . అయితే ఇప్పుడు పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంది దీని యవ్వారం .

అడపా దడపా సినిమాలు తప్ప చెప్పుకోవడానికి ఒక్క సరైన వెబ్ సిరీస్ కూడా ఆహా లో లేదు ..ఈ మధ్య కాలం లో రిలీజ్ అయినా జోహార్ , మెట్రోకథలు ,పర్వాలేదనిపించినా ,రీసెంట్ గ రిలీజ్ అయిన బుచ్చినాయుడు కండ్రిగ మూవీ నిరుత్సహ పరిచింది .అయితే ఈ సారి ఓ మలయాళ చిత్రం తో రాబోతుంది ఆహా ..

మలయాళం లో సూపర్ హిట్ అయిన” ఆస్కార్ గోస్ టూ ” సినిమాని ఈ నెల 28 న ప్రేక్షకులముందుకు రానుంది .ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచేసింది .. ఒక మంచి సినిమా చేసామన్న అనుభూతి కలుగుతుందని ఈ సారి మాత్రం కచ్చితంగా ఆహా ఓ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు .