టాలీవుడ్ నటి అభినయ గురించి మీకు తెలుసా

Do you know about Tollywood actress Abhinaya

0
184

అభినయ టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి. తెలుగు, తమిళ భాషలలో చాలా సినిమాల్లో నటించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన అభినయను ఎలాగైనా మాట్లాడించాలని ఆమె తల్లిదండ్రులు చాలానే ప్రయత్నాలు చేశారు. ఎన్నో ఆస్పత్రులకి తీసుకువెళ్లారు కాని కుదరలేదు. ఆమెకు సినిమాలు అంటే చాలా ఇష్టం నటించాలనే కోరిక ఉండేది.

కానీ ఆమె వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం వల్ల అవకాశాలు రాలేదు. ఇక ఆమె తండ్రి యాడ్స్ లో నటించేలా ప్రయత్నాలు చేశారు . అక్కడ పలు యాడ్స్ లో నటించింది. ఇక ఆమె తండ్రి కూడా సినిమా వారి దగ్గరకు వెళ్లి కూతురి గురించి చెప్పి, ఫోటోలు ఇచ్చి అవకాశాల కోసం అడిగేవారు. తొలిసారి నాదోదిగల్ అనే సినిమాలో ఆమెకి ఛాన్స్ వచ్చింది.

ఆ సినిమాలో ఆమె పాత్రకి గాను ఏకంగా 13 అవార్డులు వచ్చాయి. తెలుగులో శంభో శివ శంభో గా ఈ సినిమా వచ్చింది. ఇందులో రవితేజ చెల్లిగా చేసింది. తర్వతా వరుసగా దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో అభిన‌య నటించింది. ఆమెకి సంబంధించిన డైలాగ్స్ ని ముందుగా దర్శకులు ఆమె తల్లిదండ్రులకి వివరిస్తారు. వారు ఆమెకి సైగల ద్వారా చెబుతారు. ఆమె సింగిల్ టేక్ లో చెబుతుందట. నిజంగా గ్రేట్ అంటున్నారు ఆమె గురించి తెలిసిన వారు అందరూ.