డైరెక్టర్ తేజ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మీకు తెలుసా ఆయన ఎవరంటే ?

Do you know Director Teja Family Background

0
88

టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు డైరెక్టర్ తేజ. జయం,నువ్వు నేను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి ఆయన ఖాతాలో. తేజ అసలు పేరు జాస్తి ధర్మ తేజ.సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా డైరెక్టర్ గా రాణించారు తేజ. ఆయన 1966వ సంవత్సరంలో మద్రాసు లో జన్మించారు. బాగా ఆర్ధికంగా ఉన్న కుటుంబంలో తేజ జన్మించారు.
డైరెక్టర్ తేజ తండ్రి పేరు జె.బి.కే.చౌదరి.

బాల గురుకుల పాఠశాలలో ఆయన చదువుకున్నారు. మీకు తెలుసా జీవిత రాజశేఖర్ ఆయన క్లాస్మేట్స్. అంతేకాదు తమిళ సూపర్ హిట్ దర్శకుడు శంకర్ కూడా తేజ కు సీనియర్ వీరందరూ ఒకే చోట చదువుకున్నారట. ఇక అనేక వ్యాపారాలు చేసేవారు తేజ తండ్రి. కాని కొన్ని రోజులకి ఆయన వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఆర్ధికంగా నష్టపోయారు.

డైరెక్టర్ తేజ వారి బాబాయ్ ఇంట్లో ఉండేవారు. ఆ సమయంలో దర్శకుడు వర్మ దగ్గర ముందు
సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఇక తర్వాత దర్శకుడిగా మారి సినిమాలు తీశారు. సినిమా పరిశ్రమలో చాలా మంది స్టార్ నటులని పరిచయం చేశారు తేజ.