హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా

Do you know heroine Kamna Jethmalani what is doing now

0
89

హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు పొందిన హీరోయిన్. పలు సినిమాల్లో నటించింది. రణం సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. అయితే కొద్ది కాలం వరుస సినిమాలు చేసిన ఈ అందాల తార తర్వాత సినిమాకు దూరం అయింది, తర్వాత వైవాహిక జీవితంలో బిజీగా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామ్నా మాట్లాడింది.తన వ్యక్తిగత జీవితంతోపాటు, సినిమాల్లోనూ నటించాలనుందంటూ ఆసక్తికర విషయాలను చెప్పుకోచ్చింది. తనది సింధీ ఫ్యామిలీ అని చెప్పింది కామ్నాజెఠ్మలానీ.మా కుటుంబంలో 21 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేస్తారని కానీ మా అమ్మ నాకు సపోర్ట్ చేసిందని కామ్నా జెఠ్మలానీ చెప్పారు.

ఇక ముందు తాను మోడలింగ్, డ్యాన్సర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసానని చెప్పుకొచ్చింది. ఇక తనకు ఎంగేజ్ మెంట్ సమయంలో చేతిలో మూడు సినిమాల ఉన్నాయని ఆ సమయంలో సినిమాలు చేస్తూ వివాహం చేసుకున్నా అని చెప్పింది. తనకు సినిమాలు చేయమంటే ఇష్టమని. అందుకు తన భర్త కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలో నటించాలనుందని. అలాగే రాజమౌళి సినిమాలో ఒక చిన్న పాత్ర అయినా చేయాలనుందని తెలిపింది. ఆమె అభిమానులు ఆమెని సినిమాల్లో నటించాలి అని కోరుకుంటున్నారు.