కుటుంబ కథా చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు జగపతిబాబు, అంతేకాదు ఉమెన్ ఫాలోయింగ్ ఆయనకు ఎంతో ఉండేది, అనేక ఫ్యామిలీ చిత్రాలు చేశారు ఆయన, ఇక ఆయన కెరియర్లో చేసిన సినిమాలు చాలా వరకూ సూపర్ హిట్ అయ్యాయి.
జగపతి బాబు తండ్రి నిర్మాత కావడంతో.. తన తండ్రి సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమాల్లో నటించడం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు అనే విషయం తెలిసిందే..అయితే కొంత కాలం తర్వాత ఆయన ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డారు.
ఇక కొన్ని సినిమాలు సొంత బ్యానర్లో చేయడం వల్ల ఆర్దిక నష్టాలు వచ్చాయి.. జగపతి బాబు జల్సా ఖర్చులకు.. అడిగిన వారికి అడిగినట్లు సహాయం చేయడం జగపతిబాబు నైజం దీంతో కోట్ల రూపాయలు నష్టపోయారు. తర్వాత సినిమా అవకాశాలు రాలేదు, అయితే ఇలాంటి సమయంలో ప్రతినాయకుడి పాత్ర వచ్చింది, బాలకృష్ణ లెజెండ్ సినిమాలో విలన్ గా చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అక్కడ నుంచి టాలీవుడ్ లో ప్రతినాయకుడి పాత్రలు చేసి ఆర్దికంగా మళ్లీ నిలదొక్కుకున్నారు