మెగా హీరో వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన.. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది, టాలీవుడ్ లో వసూళ్లతో దూసుకుపోతోంది….డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో ఉప్పెన సినిమా విడుదలైంది.. ఈ సినిమా హిట్ తో ఇటు దర్శకుడికి మంచి పేరు వచ్చింది.. వీరిద్దరి నటనకు టాలీవుడ్ పెద్దలు కూడా మంచి కామెంట్లు ఇస్తున్నారు, ఇక ప్రేక్షకలోకం ఫిదా అయింది.
ఇక ఆమెకి పలు సినిమాల్లో అనేక అవకాశాలు వస్తున్నాయట,. అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, ముందు ఈ సినిమాలో మనీషా అనే నటిని ఒకే చేసిన మూవీ టీమ్ తర్వాత మరోసారి ఆలోచించారు, కృతిశెట్టి ఫోటోలను చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట దర్శకుడు. ఇక సుకుమార్ తో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడి తన ఓపీనియన్ చెప్పారట.
అప్పుడు సినిమా బాగా రావాలి అంటే నీకు ఎవరిని తీసుకోవాలనుకుంటే వారిని తీసుకొమ్మని సలహా ఇచ్చారట, దీంతో ఆమెని ఫైనల్ చేశాడు బుచ్చిబాబు. ఇక కుర్రకారికి ఆమె నటన బాగా నచ్చింది, ఆమెతో సినిమాలు చేయడానికి పలువురు దర్శకులు హీరోలు సిద్దం అవుతున్నారిప్పుడు.