ఏ ఆర్ మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన గజిని సినిమా మన దేశ సినిమా చరిత్రలో ఓ సూపర్ హిట్ సినిమా అనే చెప్పాలి, మంచి స్టోరీ లైనప్ సూర్యకి అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో మంచి హిట్ గా నిలిచింది.
ఇక నయనతార, ఆసిన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి, అయితే ఈ సినిమాని చూసిన వారు అందరూ కూడా దీనికి సూర్యనే బాగా సెట్ అయ్యారు అని అన్నారు… దాదాపు ఆ ఏడాది అన్నీ అవార్డులు ఈ సినిమాకి వచ్చాయి… అయితే దర్శకుడు ముందు ఈసినిమాని చాలా మంది హీరోలకి వినిపించారట… చివరకు ఫైనల్ గా దీనిని సూర్య ఒకే చేశారు.
ముందు ఈ స్టోరీ మహేష్ బాబు దగ్గరకు వచ్చిందట, తర్వాత పవన్ కల్యాణ్ దగ్గరకు వచ్చింది..ఇక కమల్ కు కూడా చెప్పారట, అయితే అజిత్ ఒకే అన్నారు కొన్ని రోజులు షూటింగ్ చేశారు కాని తర్వాత ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు ఇక తర్వాత సూర్య ఈ సినిమాకి ఒకే చెప్పారు.