బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పారితోషికం ఎంతో తెలుసా?

0
125

బిగ్​బాస్​ తాజా సీజన్​ ఇటీవలే గ్రాండ్​గా స్టార్ట్ అయింది. ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ 6 సీజన్ కి హోస్టుగా నాగార్జున చేయబోతున్నారు. ఈ సారి మొత్తం 21 మంది కంటెస్టెంట్​లు హౌస్​లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి కంటెస్టెంట్లలో అందరి కంటే ఎక్కువ ఎవరు పారితోషికం అందుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..

కంటెస్టెంట్​లలో ఫైమాకు వారానికి రూ.50వేలు ఇవ్వగా.. ఆరోహీ రావు, ఇనయా సుల్తానా లక్ష రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక రాజశేఖర్, అభినయశ్రీ, సుదీప.. వారానికి రూ. 1.50 లక్షలు కాగా గలాటా గీతూ వారానికి రూ.1,75,000 తీసుకుంటున్నట్లు సమాచారం. వాసంతి కృష్ణన్, సాల్మన్ , శ్రీ సత్య, ఆదిరెడ్డిలు వారానికి రూ.2లక్షల పారితోషికం తీసుకునేలా అగ్రీమెంట్​ చేసుకున్నారట.

మెరీనా వారానికి రూ.2.50 లక్షలు కాగా హీరో బాల ఆదిత్య, ఆర్ జె సూర్య వారానికి రూ.3 లక్షల పారితోషికం అందుకుంటున్నారట.

రోహిత్ వారానికి రూ.3.25 లక్షలు, శ్రీహాన్ రూ.3.50 లక్షలు, చలాకి చంటి, రేవంత్ రూ.4 లక్షలు అందుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారట.

మొత్తంగా చూసుకుంటే తాజా సీజన్​లో చలాకి చంటి , సింగర్ రేవంత్ నాలుగు లక్షల పారితోషికం తీసుకుంటూ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు.