రెబల్స్టార్ ప్రభాస్ తాజాగా రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తి చేస్తున్నారు, ఇక ప్రభాస్ తన తదుపరి చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు, అయితే తాజాగా ఈ సినిమా గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకి నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారు. పీరియాడిక్ లవ్స్టోరి కావడంతో ప్రభాస్ లుక్, స్టైల్ అన్నీంటిలో జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాలో ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం ఆరు కోట్లు ఖర్చు చేశారు అని వార్తలు వినిపించాయి.. తాజాగా రాధేశ్యామ్ గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో రైల్వే స్టేషన్ సీన్ను మనం చూసుంటాం.
చాలా అద్బుతంగా ఉంది అయితే దీనిని ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సెట్ వేసి చిత్రీకరించారు.
అయితే ముందు ఇటలీలో అనుకున్నా కోవిడ్ కారణంగా ఇక్కడ తీయడం జరిగింది, అయితే తాజాగా ఈ సెట్ కోసం ఏకంగా
రూ.1.6కోట్లు ఖర్చు పెట్టారట నిర్మాతలు.. ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ సెట్ వేశారు, దాదాపు 250 మంది దీని కోసం వర్క్ చేశారు అని తెలుస్తోంది జూలై 30న రాధేశ్యామ్ చిత్రం విడుదల కానుంది.