పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా

Do you know how much remuneration Power star Pawan Kalyan got for his first film?

0
92

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈపేరు వింటేనే సరికొత్త పవర్ వస్తుంది. ఆయన అభిమానులు ఆయనని ఎంతలా ప్రేమిస్తారో తెలిసిందే. మెగాస్టార్ తర్వాత పవర్ స్టార్ కి అంతటి పేరు ఇమేజ్ వచ్చాయి. టాలీవుడ్ లో లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు పవన్ కల్యాణ్ కి. ఇక టాలీవుడ్ లో ఆయన సినిమా వస్తోంది అంటే సరికొత్త రికార్డులు నమోదు అవుతాయి. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది.

ఇక ఆయనతో సినిమా అంటే దాదాపు ఆయన రెమ్యునరేషన్ 40 నుంచి 50 కోట్లు ఉంటుంది అంటారు. అయినా ఆయన డేట్స్ చాలా దొరకడం కష్టం. ఆయన ఒకే అనాలే కాని పది మంది నిర్మాతలు ఆయనకు అడ్వాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.
అయితే పవన్ మొదట్లో తన తొలి సినిమా చేసిన సమయంలో ఎంత పారితోషికం తీసుకుని ఉంటారు అని చాలా మంది ఆలోచనతో ఉంటారు? నిజంగా ఏ హీరోకి అయినా తొలి సినిమా ఆ రెమ్యునరేషన్ జీవితాంతం గుర్తు ఉంటాయి.

పవన్తో తొలి సినిమాను అల్లు అరవింద్ చేశారు. దర్శకులు ఈవీవీ సత్యనారాయణ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేశారు. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నెలకు 5 వేల రూపాయలు ఇచ్చారట నిర్మాత అల్లు అరవింద్. ఈ విషయం అప్పట్లో పవన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పవన్ను అద్భుతంగా ప్రమోట్ చేసారు ఆనాడు దర్శకుడు ఈవీవీ. నిజంగా పవన్ చాలా గ్రేట్ కేవలం 5 వేల రూపాయలకు మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు సినిమాకి 50 కోట్లు తీసుకునే వరకూ వచ్చింది అంటారు ఆయన అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు. దీని వెనుక ఆయన 25 ఏళ్ల శ్రమ ఉంది.