ఎవరు ఎంత పెద్ద పొజిషన్ కు వెళ్లినా సొంత ఊరు గ్రామం మర్చిపోలేరు, కన్నతల్లిని సొంత ఊరుని ఎవరూ మర్చిపోలేరు, అమ్మ పేరు ఇస్తుంది, ఊరు చిరునామా ఇస్తుంది, అలా ఎస్పీ బాలు కూడా తన సొంత గ్రామం పై ఎంతో ఇష్టం పెంచుకున్నారు.
ఆయన చదువుకు వేరే ప్రాంతం వెళ్లినా తన పుట్టిన ఊరిపై మమకారం ఉండేది.
ఆయన మరణంతో ఆయన సొంత గ్రామంలో విషాదం నెలకొంది. కొనటంపేట గ్రామంలో విషాదం నెలకొంది.
ఇక్కడ బాలు రెండు నుంచి 8 వ తరగతి వరకూ ప్రాధమిక స్కూల్లో చదువుకున్నారు, తను ఎంతో గొప్ప సింగర్ అయిన తర్వాత తను చదువుకున్న స్కూల్ కు ఆర్ధిక సాయం చేశారు, శ్లాప్ కు నగదు ఇచ్చారట
శ్రీ వేంకటేశ్వర యువజన సేవా సంఘం పేరుతో పాత విద్యార్థులు సంఘంగా ఏర్పడి స్కూలు అభ్యున్నతికి ఎస్పీ బాలు సాయం చేసారు.
ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు, అంతేకాదు దానికోసం అవసరం అయిన 14 లక్షల నగదు అందచేశారు మరుగుదొడ్లు తాగు నీటి సౌకర్యానికి 13 లక్షలు నిధులు ఇచ్చారు, ఇక్కడ పేదలకు ఆర్ధిక సాయం బట్టలు నిత్య అవసర వస్తువులు అందించేశారు, ఇక పిల్లలకు పుస్తకాలు అందచేసేవారు ప్రతీ ఏడాది.
మా ఇంటి మనిషి మాకు దూరం అయిన బాధ ఉంది అంటున్నారు అక్కడ జనం, అక్కడ అందరూ విషాదంలో ఉన్నారు,. ఇప్పటికీ బాలు బంధువులు కొందరు ఉన్నారు ఈ గ్రామంలో.