హీరోయిన్ స్నేహ దంపతులు యాడ్స్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారో తెలుసా

Do you know how much the heroine sneha couple is earning through ads

0
91

హీరోయిన్ సౌందర్య తర్వాత అంత మంచి పాత్రలు పోషించి ఎంతో గొప్ప గుర్తింపు అభిమానం సంపాదించుకున్నారు హీరోయిన్ స్నేహ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన నటించింది స్నేహ. 2000లో గోపీచంద్ హీరోగా నటించిన తొలి వలపు సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది స్నేహ. అక్కడ నుంచి ఆమెకి అనేక అవకాశాలు వచ్చాయి.

ఇక సినిమా నటుడు ప్రసన్నని వివాహం చేసుకున్నారు. ఈయన కూడా చిత్ర సీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. అయితే వీరిద్దరూ కలిసి పలు యాడ్స్ కూడా చేస్తున్నారు. అంతేకాదు మంచి ఆదాయం కూడా యాడ్స్ నుంచి ఎండార్స్ నుంచి వస్తోందట స్నేహ దంపతులకి.

ఈ జంట కంఫర్ట్ ఫాబ్రిక్, ఆశీర్వాద్, సన్ ఫీస్ట్ మ్యారి లైట్, విమ్ బార్, జి.ఆర్.టి జ్యుయలర్స్ ఇలాంటి యాడ్స్ చేశారు. ఇక ఆమె సోలోగా వైభవ్ కలెక్షన్స్ ,ఆశీర్వాద్ గులాబ్ జామ్ కి యాడ్ లో చేశారు. ఇలా ఈ జంట సుమారు 3 కోట్ల వరకూ యాడ్స్ నుంచి సంపాదించారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వీరి యాడ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అందుకే కంపెనీలు ఈ జంటతో యాడ్స్ చేస్తున్నాయి.