జెనీలియా – రితేష్ మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తెలుసా

Do you know how the love started between Genelia and Ritesh

0
123

జెనీలియా టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాలో ఆమె నటనని అందరూ అభినందించారు. హా..హా.. హాసిని.. అంటూ తన అల్లరి చేష్టలతో క్యూట్ యాక్టింగ్తో యూత్ మనసు దోచింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర్నుంచి నితిన్, రామ్, రామ్ చరణ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ చిత్ర సీమలో సినిమాలు చేసింది.

ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో హిందీలో స్టార్ హీరోగా ఉన్న రితేశ్ దేశ్ముఖ్ను ప్రేమ వివాహం చేసుకుంది. జెనీలియా మొదటగా హిందీలో తుజే మేరీ కసమ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో రితేశ్ హీరోగా నటించారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. ఇక ఆయన కుటుంబం రాజకీయ కుటుంబం కావడంతో ఆయన అలాగే ఉంటారు అని జెనీలియా అనుకుంది.

కానీ జెనీలియా అనుకున్న దానికి భిన్నంగా రితేశ్ సెట్లో అందరితో కలిసిపోయి సరదాగా ఉన్నారు. వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. దాదాపు 9 సంవత్సరాల పాటు వీరిద్ధరూ ఇలాగే కొనసాగారు. 2012 ఫిబ్రవరి 3న వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మళ్లీ సినిమాల్లోకి రావాలి అని ఫ్యాన్స్ కోరుతున్నారు.