సూర్యతో నటించే సినిమాలో కృతి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

0
94

ఉప్పెన సినిమాతో మంచి పేరు దక్కించుకున్న కృతిశెట్టి తాజాగా బంగార్రాజు సినిమాలో నటించి ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఆ సినిమా మంచి కలెక్షన్స్ వసూళ్లు చేసి టాప్ స్థాయిలో నిలిచింది. ఇంకా ఆమె ఖాతాలో అర డజనుకు పైగా తెలుగు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.ఈ బ్యూటీ ఇప్పటికే ఒక్కో సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్‌ని తీసుకుంటుంది.

18 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో సూర్య, బాలా కాంబో రిపీట్ కాబోతోంది. ప్రస్తుతం సూర్య, బాల క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. అయితే ఈ సినిమాకు కృతి పారితోషికాన్ని మరింత పెంచేసిందట. అదే ఇప్పుడు సౌత్ లో చర్చనీయ అంశంగా మారింది. ఈ సినిమా కోసం కృతి ఏకంగా కోటిన్నర అడిగిందని అంటున్నారు. నిర్మాతలు కూడా ఆమె అడిగిన రెమ్యూనరేషన్ కు వెంటనే ఓకే చెప్పేశారట.