చాలా మందికి ఓ అనుమానం ఉంటుంది.. సినిమాలో హీరోలు హీరోయిన్లు నటులు చాలా దుస్తులు వాడతారు కదా.. మరి ఇవి రెంట్ కు తీసుకువస్తారా లేదా కొంటారా అని , రెంట్ కి తెస్తే ఒకే కొంటే చాలా నగదు నిర్మాతలకు అవుతుంది కదా.. అయితే మరి ఈ కాస్టూమ్స్ ఏం చేస్తారు అసలు వీటిని ఎక్కడ తెస్తారు అని చాలా మందికి ఓ అనుమానం ఉంటుంది.
అయితే ఇప్పుడు చాలా మంది హీరోలు ముందు గానే తమ స్టైలిష్ లతో లేదా చిత్రానికి సంబంధించిన స్టైలిష్ లతో కథలకు తగ్గట్లు దుస్తులు సిద్దం చేయిస్తున్నారు, అవే ఒకవేళ బ్రాండెడ్ దొరికితే వాటిని నేరుగా తీసుకువస్తారు. అయితే ఇప్పుడు ఇలా దుస్తులు రిపీట్ చేయడానికి లేదు.. ఎవరికి వారు సినిమా సినిమాకి డ్రెస్సులు మార్చేస్తున్నారు.కాస్ట్యూమ్స్ సరికొత్తగా డిజైన్ చేయిస్తున్నారు.
గతంలో ఇలా చాలా మంది సినిమాల్లో హైలెట్ అయిన డ్రెస్సులు వేలం పాట వేసి ఆనగదుని చారిటీలకు కూడా అందచేశారు..
సో ఇప్పుడు నిర్మాతలు ముందుగానే దుస్తులకి ఇంతని అలాట్ చేస్తున్నారు నగదు, ఇక రెంట్ కి తీసుకువచ్చేది చాలా తక్కువ.. ఇక సినిమా పూర్తి అయిన తర్వాత కొన్ని నిర్మాణ సంస్ధలు మరో సినిమాకి వాడుకుంటున్నాయి.. లేదు అంటే వాటిని వేలం వేస్తున్నారు.. సో ఇప్పుడు అయితే చాలా వరకూ నిర్మాణ సంస్ధలు ఇలా హీరోల దుస్తులు ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగినట్లు డిజైన్ చేయిస్తున్నారు.