కార్తీక దీపం సీరియల్ లో నిరుపమ్ కి – సౌందర్యకి ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుందో తెలుసా

Do you know the age gap between Nirupam and Soundarya in the Karthika Deepam serial?

0
129

కార్తీక దీపం సీరియల్ ని తెలుగులో లక్షలాది మంది అభిమానిస్తున్నారు. ఇక ఆ సీరియల్ నటులని తమ ఇంటి సభ్యులుగానే ఫీల్ అవుతున్నారు. అంతలా ఈ సీరియల్ లో ప్రేక్షకులు లీనం అయిపోయారు. ఇక ఇందులో ఉన్న నటీనటుల గురించి అనేక వార్తలు కూడా వింటున్నాం. ముఖ్యంగా డాక్టర్ బాబు, దీప, హిమ, శౌర్య, మౌనిత, ప్రియమణి, సౌందర్య, ఆనందరావు ఈ క్యారెక్టర్ల కి ఎంతో పేరు వచ్చింది.

అయితే ఈ సీరియల్లో హీరో నిరుపమ్ పరిటాల డాక్ట‌ర్ బాబు, సీరియ‌ల్లో అతడి తల్లిగా చేస్తున్న‌ అర్చన అనంత్ సౌంద‌ర్య గురించి చెబితే తల్లి కొడుకులుగా అద్భుతంగా నటిస్తున్నారు అనే చెప్పాలి. ఈ సీరియల్ లో సౌందర్య పాత్ర చేస్తున్న అర్చనని ఆమె లుక్ చూసిన తర్వాత అర్చనకు వయసు 40 పైనే ఉంటుందని అంతా అనుకుంటారు.

అయితే వీరిద్దరి మధ్య కచ్చితంగా 10 ఏళ్లు గ్యాప్ ఉంటుంది అని అనుకుంటారు అభిమానులు. కాని అర్చన, నిరుపమ్ ఒకే ఏడాది పుట్టారు. 1988 జనవరిలో అర్చన జన్మిస్తే. అదే ఏడాది చివర్లో నిరుపమ్ పుట్టాడు. కేవలం నెలల గ్యాప్ లోనే పుట్టారు. అయితే పాత్రల బట్టీ ఇలా నటిస్తున్నారు. ఏది ఏమైనా ఇద్దరి నటన మాత్రం సూపర్ అనే అంటున్నారు ఫ్యాన్స్.