సీరియళ్ల నిర్మాణ విలువలు భారీగా పెరిగాయి మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి, చిన్న తరహా సినిమా కంటే సీరియళ్ల నిర్మాణమే ఎక్కువగా ఉంటోంది ఇప్పుడు… బుల్లితెర నటుల రెమ్యునరేషన్ కూడా లక్షల్లో ఉంటోంది, అయితే ఇప్పుడు సీరియల్ నటులకి భారీ డిమాండ్ ఉంది, ముఖ్యంగా బుల్లితెరలో ఇలా ఎందరో అలరిస్తున్నారు తమ నటనతో.
బుల్లితెరలో నటుడు ప్రభాకర్ కి మంచి పేరు ఉంది…పలు సూపర్ హిట్ సీరియల్స్ లో ఆయన నటిస్తున్నారు…బుల్లితెరలో ఆయనని మెగాస్టార్ అని పిలుస్తారు, ఇక పలు సీరియల్లులో నటించిన ఆయన సినిమాల్లో కూడా నటించారు….ప్రస్తుతం బుల్లితెరపై వరస సీరియల్స్ చేస్తూ బిజీ అయిపోయాడు. వదినమ్మ సీరియల్ ఆయనకు మరింత ఫేమ్ తెచ్చిపెట్టింది, రేటింగ్ లో టాప్ లో ఉంటోంది, అయితే ఆయన ఆస్తులు కూడా భారీగానే ఉంటాయి అని వార్తలు వైరల్ అవుతున్నాయి, ఆయనకి సుమారు ఎపిసోడ్ కు లక్షల్లో రెమ్యునరేషన్ ఉంటుంది అంటున్నారు.
తెలుగు బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ప్రభాకర్ ముందున్నాడు. ఇక ఆయనకు సుమారు 10 కోట్ల వరకూ ఆస్తులు ఉండచ్చు అని బుల్లితెర వర్గాల టాక్. ఇక ఆయన సమాజ సేవలో కూడా ముందు ఉంటారు అనే విషయం తెలిసిందే.