ఐటం సాంగ్ కు బుట్ట బొమ్మ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

0
114

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న పూజా  ప్రస్తుతం వరుస ఆఫర్ లతో  ఫుల్ బిజిగా ఉంది. రంగస్థలం సినిమాలో ఐటం సాంగ్ తో మనందరినీ ఆకట్టుకుంది. మెగాస్టార్‌ చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో పాటు అఖిల్‌ లాంటి యంగ్‌ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ సినిమాలలో నటించి మంచి పేరు దక్కించుకుంది.

కేవలం కథనాయకిగానే కాకుండా ఐటమ్ సాంగ్ లకు డాన్స్ చేయడానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది పూజ. ప్రస్తుతం ఎఫ్-3 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఎఫ్-3 చిత్రబృందం పూజాను మీట్ అవ్వడంతో దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ అమ్మడు. అయితే ఈ పాటకు ఏకంగా రూ.1.25 కోట్లు డిమాండ్ చేయడంతో..కోటి ఇస్తామని నిర్మాతలు ఒప్పించారట.