ఆర్తి అగర్వాల్ తెలుగులో అగ్ర హీరోలతో ఆమె అనేక సినిమాల్లో నటించింది .. కాని చిన్న వయస్సులోనే అనుకోని కారణాల వలన కన్ను మూసింది. ఆర్తి అగర్వాల్ అమెరికాలో స్థిర పడిన గుజరాతీ ఫ్యామిలీలో న్యూజెర్సీలో మార్చి 5, 1984న జన్మించింది. అక్కడే ఆమె చదువు సాగింది.14 వ ఏట మోడలింగ్ లోకి అడుగుపెట్టింది.
ఇక 16వ ఏటలోనే హిందీ చిత్ర సీమలో అడుగుపెట్టింది, 2001వ సంవత్సరంలో హిందీలో పాగల్పన్ అనే సినిమాలో నటించింది.
తెలుగులో కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. అందులో ఆమె నటించింది. తర్వాత ఆమెకి అనేక సినిమాలు అవకాశాలు వచ్చాయి.
తెలుగులో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది, తర్వాత సినిమాల్లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలి అని అనుకున్న సమయంలో ఆమె కాస్త బరువు తగ్గడానికి ప్రయత్నించింది.. ఈ సమయంలో ఆమె లైపో సెక్షన్ ఆపరేషన్ చేయించుకుంది… సర్జరి తర్వాత కొంత కాంప్లికేట్ అయ్యి ఆపరేషన్ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్ జూన్ 6 న 2015న మరణించింది.
|
|
|
ఆర్తి అగర్వాల్ మరణానికి కారణం తెలుసా – ఆమె రియల్ స్టోరీ
-