‘బింబిసార’ ఫస్ట్ డే కలెక్షన్స్​ ఎంతో తెలుసా?

0
96

కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ట్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో  ప్రకాశ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరెకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. బింబిసారాను రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.13 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే తొలిరోజే దాదాపు 50 శాతంకు పైగా కలెక్షన్లను అందుకుంది. 6.3కోట్ల షేర్​ను వసూలు చేసింది.

నైజాం-2.15 కోట్ల రూపాయలు.

సి డెడ్-1.29 కోట్ల రూపాయలు.

ఉత్తరాంధ్ర-90 లక్షలు.

ఈస్ట్ గోదావరి-43 లక్షలు.

వెస్ట్ గోదావరి-36 లక్షలు.

గుంటూరు-57 లక్షలు.

కృష్ణ-34 లక్షలు.

నెల్లూరు-26 లక్షలు.