సిరివెన్నెల రాసిన చివరి పాట ఏంటో తెలుసా?

0
75

ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. సీతారామశాస్త్రి తన కెరీర్​లో దాదాపు 800కు పైగా చిత్రాల్లో మూడు వేలకు పైగా పాటలను రచించారు.

ఈ మధ్య వెంకటేష్ ‘నారప్ప’, వైష్ణవ్​ తేజ్​ ‘కొండపొలం’ సినిమాల్లోనూ ఆయన సాంగ్స్​ను రాశారు. ‘ఆర్​ఆర్​ఆర్’​ సినిమాలోని ‘దోస్తీ’ పాట కూడా రాసింది ఆయనే. ఈ సాంగ్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆయన చివరిసారిగా పని చేసింది నాని నటించిన ‘శ్యామ్​సింగరాయ్​’ కోసం. ఈ చిత్రంలో రెండు పాటలు రాశారు సిరివెన్నెల. ఇవే ఆయన చివరి పాటలు కావడం విషాదకరం.