శివ శంకర్‌ మాస్టర్‌ చివరి కోరిక ఏంటో తెలుసా?

Do you know the last wish of Lord Shiva Shankar?

0
98

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కొద్ది రోజులుగా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివశింకర్‌ మాస్టర్‌ నిన్న సాయంత్రం కన్నుమూశారు.

శివశంకర్‌ భౌతిక కాయానికి రేపు (సోమవారం) మధ్యాహ్నాం 2 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంతకుముందు అభిమానుల సందర్శనార్థం మణికొండ పంచవటి కాలనీలోని తమ నివాసానికి మాస్టర్‌ భౌతిక కాయాన్ని తరలించనున్నారు.

డ్యాన్స్‌తోనే ఎన్నో హావభావాలను పలికించే మాస్టర్‌ 80కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫి అందించారు. అలాంటి మాస్టర్‌ తన చివరి శ్వాస వరకు పని చేయాలని ఆకాంక్షించారు. మరణం కూడా తనకు షూటింగ్‌లోనే రావాలని, సినిమా సెట్‌లోనే తను కన్నుమూయాలనేది తన ఆఖరి కోరిక అని శివశంకర్ మాస్టర్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.