‘RRR’ నిడివి ఎంతో తెలుసా?

Do you know the length of 'RRR'?

0
115

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. వచ్చే ఏడాది సంక్రాంతికి వారం రోజులు ముందుగానే అంటే జనవరి 7న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతున్న ఈ సినిమా టాకీ పార్ట్ ను రీసెంట్ గా పూర్తి చేశారు. తారక్, చెర్రీ డబ్బింగ్ చెప్పడం కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు.

దీపావళి నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. ఈలోగా ఈ సినిమా ఫైనల్ కట్ ను కూడా జక్కన్న పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రఫ్ కట్ దాదాపు 3 గంటల డ్యూరేషన్‌తో వచ్చిందట. దాన్ని 2 గంటల 45 నిమిషాలకు తగ్గించడానికి రాజమౌళి అండ్ టీమ్ ప్రయత్నిస్తోందట. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేస్తారట.